ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింక్ లెమన్ జ్యూస్...

Recipes |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 09:57 PM

కావాల్సిన పదార్థాలు : నల్ల ద్రాక్ష(సీడ్ లెస్) - 8 లేదా 10, పంచదార - 2 స్పూన్లు, ఐస్ క్యూబ్స్ - 4, బ్లాక్ సాల్ట్ - కొద్దిగా నిమ్మకాయ - 1, సబ్జా - 2స్పూన్లు. 


తయారీవిధానం: ముందుగా 2 స్పూన్ల సబ్జాను ఒక చిన్న గిన్నెలో నానబెట్టుకోవాలి. 8 లేదా 10 నల్లద్రాక్ష పండ్లను నీటితో బాగా కడిగి చిన్న మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల పంచదారను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లను కలుపుకోవచ్చు. ఇప్పుడొక గ్లాసును తీసుకుని అందులో 4 ఐస్ క్యూబ్స్ ను, 


కొద్దిగా బ్లాక్ లేదా సాధారణ ఉప్పును, నిమ్మకాయ రసాన్ని , మిక్సీ జార్ లోని నల్ల ద్రాక్ష మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలను ఈ గ్లాసులో వేసుకుంటే ఎంతో రుచికరమైన పింక్ లెమన్ జ్యూస్ రెడీ...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com