చాలా సులభంగా కేవలం అయిదు నిమిషాల్లో చేసే బ్లూ మొజిటో సమ్మర్ దాహానికి చాలా మంచి పరిష్కారం. వేసవిలో ఇంటికెవరైనా బంధువులొస్తే ఈ రెసిపీని చేసి వారికీ ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని తెగ మెచ్చుకుంటారు. చాలా బాగుంది. ఎలా చేసారు? అని మిమ్మల్ని అడగకపోతే నమ్మండి.
బ్లూ మొజిటో తయారీకి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ - 1, పుదీనా ఆకులు - 5, ఐస్ క్యూబ్స్ -3, స్ప్రైట్ - చిన్న బాటిల్.
తయారీవిధానం: ముందుగా నిమ్మకాయను బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చెయ్యండి. ఇప్పుడొక చిన్న గ్లాస్ తీసుకుని అందులో మూడు నిమ్మకాయ ముక్కలను, 5 పుదీనా ఆకులను వేసుకోవాలి. ఆ తర్వాత గ్లాస్ లోనే నిమ్మకాయ ముక్కలను, పుదీనా ఆకులను కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనికి కొంచెం బ్లూ ఫుడ్ కలర్ ను యాడ్ చెయ్యండి. ఇప్పుడు అందులో 3 ఐస్ క్యూబ్స్ ను , గ్లాస్ కు కొంచెం తక్కువగా స్ప్రైట్ ను పోసుకోవాలి. గ్లాస్ పై చిన్న నిమ్మకాయ ముక్కను చేర్చితే చూడటానికి రెస్టారెంట్ లుక్ వస్తుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బ్లూ మొజిటో రెడీ...