యూఎస్ కి చెందిన జియోన్ క్లార్క్ అనే వ్యక్తికి రెండు కాళ్లు లేవు. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ అనే చాలా అరుదైన జెనెటిక్ డిజార్డర్ వల్ల అతడు రెండు కాళ్లు లేకుండానే జన్మించాడు. రెండు కాళ్లు లేకపోయినా అతను తోటి మనుషులకు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాడు. రెండు కాళ్లు లేకున్నా అథ్లెట్, రెజ్లర్ అయ్యాడు. ఇప్పుడు ప్రపంచంలోనే రెండు చేతులతో అత్యంత వేగంగా పరిగెత్తే వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు.
గిన్నిస్ రికార్డులో తన పేరు నమోదవ్వడం, గిన్నిస్ ప్రతినిధులు తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను కూడా అందించడంతో జియోన్ తెగ ఆనందపడిపోయాడు. అన్నీ సక్రమంగా ఉండి కూడా ఏం చేయలేని వాళ్లకు జియోన్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒలింపిక్స్లో మెడల్ కొట్టడమే తన లక్ష్యం అని జియోన్ చెబుతున్నాడు.