ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూత్రంతో గుడ్లను ఉడికించి ప్రత్యేక వంటకం..!

international |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 12:47 PM

చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్‌లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారు. అయితే ఇక్కడ గుడ్లను ఉడికించడానికి 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం సేకరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో అక్కడివారు ప్రత్యేక వంటకం చేస్తారు. దీనికి Virgin boy egg డిష్ అనే పేరు ఉంది. ఇది ఆ ప్రాంతంలో సంప్రదాయ వంటకంగా ఉంది. దీనిని అక్కడి ప్రజలు ఇష్టంగా తింటారు. అయితే గుడ్లను ఉడికించడానికి అవసరమైన మూత్రం సేకరించడానికి అక్కడ ఫుడ్ స్టాల్ యజమానులు స్కూల్స్‌లో బకెట్లు ఉంచుతారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను వాటిలో మూత్ర విసర్జన చేయమని కోరతారు. ఆ విధంగా సేకరించిన మూత్రాన్ని గుడ్లు ఉడికించడానికి వాడతారు. వర్జిన్ బాయ్ ఎగ్ డిష్ తయారు చేయడానికి దాదాపు ఒక పూర్తి రోజు సమయం పడుతుంది. మొదటగా గుడ్లను ఆరు నుంచి ఏడు గంటల పాటు మూత్రంలో ఉంచుతారు. మూత్రంలో గుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటి బయటి షెల్ విరిగిపోతుంది. అనంతరం వాటితో డిష్‌ను ప్రిపేర్ చేస్తారు. అక్కడి ప్రజలు చాలా కాలంగా మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా మారింది. ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వేడి దెబ్బ తాకదని అక్కడి వారు చెబుతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వారు నమ్ముతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com