ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిని బుగ్గ కొరికి నీచానికి ఒడిగట్టిన హెడ్ మాస్టర్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 20, 2021, 11:26 AM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి ఒడిగట్టాడు. ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె బుగ్గను కొరికాడు. దీంతో అతడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన బిహార్ లో చోటుచేసుకుంది.


బిహార్‌ లోని కటిహార్ జిల్లాలో ఒక మైనర్ విద్యార్థినిని వేధించినందుకు ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ని ఆ గ్రామ ప్రజలు దారుణంగా కొట్టారు. పిప్రి బహిర్ స్కూల్ లో నాలుగో తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి బుగ్గ కొరికాడు. ఆ బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ హెడ్ మాస్టర్ ను స్కూల్ గదిలో బంధించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధిత బాలిక తల్లిదండ్రులు, బంధువులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసుల ముందే ఆ హెడ్ మాస్టర్ ను బయటకు లాగి కర్రలతో చితకబాదారు.


వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. హెడ్ మాస్టర్ పై దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసులకు చెప్పాలి గానీ.. మీకు మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని నిందితుడి కొట్టడం సరైంది కాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com