గుడ్డు తినేవారికి అలర్ట్..ఆ ప్రమాదం

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 15, 2021, 05:01 PM
 

ప్రతిరోజు గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యలు సలహా ఇస్తారు. ఇది నిజమే. గుడ్ల ప్రొఫైల్‌ను పరిశీలిస్తే శరీరానికి చాలా ముఖ్యమైన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కువగా తింటే అంతే రీతిలో దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. మీరు గుడ్లు తినడానికి ఇష్టపడితే దాని దుష్ప్రభావాల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. లేదంటే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు అంతేకాక ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కొంతమందికి గుడ్డులోని తెల్లసొనను తీసుకోవడం వల్ల అలర్జీ వస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంపై దద్దుర్లు, వాపు, ఎరుపు, తిమ్మిరి, అతిసారం, దురద మొదలైన సమస్యలు ఏర్పడవచ్చు. అలర్జీ సమస్యలు ఉన్నవారు గుడ్లు తినకుండా ఉండటమే మంచిది.


గుడ్డులోని తెల్లసొనలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి చాలా హానికరం. వాస్తవానికి మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ మొత్తంలో GFR (మూత్రపిండాలను ఫిల్టర్ చేసే ద్రవం) కలిగి ఉంటారు. గుడ్డులోని తెల్లసొన GFR ని మరింత తగ్గిస్తుంది. దీని కారణంగా కిడ్నీ రోగులకు సమస్య మరింత పెరుగుతుంది. గుడ్డులోని తెల్లటి భాగంలో అల్బుమిన్ ఉంటుంది. దీని కారణంగా బయోటిన్‌ను శోషించడంలో శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. దీంతో కండరాల నొప్పికి సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు రాలడం మొదలైన సమస్యలు ఏర్పడుతాయి. మరోవైపు గుడ్డులోని పసుపు భాగం గురించి మాట్లాడితే ఇందులో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఉంటుంది. మీరు రోజూ రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, డయాబెటిక్ రోగులు గుడ్లను తినకుండా ఉంటే మంచిది.