శ్మశానంలో అస్థిపంజంరంతో డ్యాన్స్ వేసిన మహిళ

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 14, 2021, 02:41 PM
 

యూకేలో హల్ సిటీలోని శ్మశానంలో శనివారం మధ్యాహ్నం సన్యాసిని నృత్యం చేయడం, అస్థిపంజరంతో ఆడుకోవడం కలకలం రేపుతోంది. ఎవరూ లేని ఆ శ్మశానానికి ఆ మహిళ ఒంటరిగా వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఓ అస్థి పంజరం దగ్గర నిలబడింది. వెంటనే ఆ ఆస్తి పంజరంతో ఆడుకోవడం, నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఈ సంఘటన హల్ జనరల్ శ్మశానవాటిక సమీపంలో జరిగింది. ఈ దృశ్యాన్ని అక్కడ ప్రయాణిస్తున్న వారు చూశారు. వాహనాలు కూడా కాసేపు ఆపేశారు. ఆ సమయంలో సన్యాసిని అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ సన్యాసిని లాగా దుస్తులు ధరించింది. ఇది కాకుండా, తలపై కండువా కూడా ధరించింది. ఈ వింత సంఘటనను శ్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు షాక్‌‌కు గురవుతున్నారు. ఆ మహిళకు మతి స్థిమితం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ శ్మశానాన్ని ఇపుడు ఉపయోగించట్లేదట. 50 ఏళ్లుగా అది మూసే ఉంది. 1847లో దానిని ప్రారంభించారు. 1972లో మూసివేశారు. కాగా, ఆ సమాధిలో కలరాతో చనిపోయిన దాదాపు 187 మృతదేహాలను ఖననం చేసినట్లు తెలుస్తోంది.