తల్లిదండ్రులను మోస్తూ 160 కి.మీ నడిచాడు!

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 11, 2021, 03:45 PM
 

బంగ్లాదేశ్ కు చెందిన ఓ వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిదండ్రులను 160 కి.మీ మోసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. మయన్మార్ లో బంగ్లా రోహింగ్యాలను దారుణంగా చంపేస్తున్న బర్మా డెత్ స్క్వాడ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి తీవ్రంగా శ్రమించాడు. వృద్ధులైన తన 65 ఏళ్ల తల్లి, 85 ఏళ్ల తండ్రి నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో వారిని తొట్టిలో పెట్టుకుని 7 రోజులపాటు 160 కి.మీ. మోసుకెళ్లాడు. చివరకు బంగ్లాదేశ్ కు చేరుకుని తన ప్రాణంతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకున్నాడు. తల్లిదండ్రులను కాపాడుకోవడం కోసం ఆ వ్యక్తి చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.