అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్గా ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్ ద్వారా తెలిపాడు. 'ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్లో జాతీయ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్స్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. అల్లా దయతో టీ20 ప్రపంచకప్లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం` అని నబీ ట్వీట్ చేశాడు. తనను సంప్రదించకుండా టీ20 ప్రపంచకప్లో ఆడే అఫ్గానిస్థాన్ జట్టును ప్రకటించడంపై రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.