ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పతకం కోసం 5 నెలల గర్భంతో ఆడేస్తోంది

international |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 04:13 PM

సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటారు. అవసరం ఉంటే తప్ప బయటకు రారు. కానీ 5 నెలల గర్భవతి అయిన ఓ మహిళ పారాలింపిక్స్ లో పాల్గొంటూ వాలీబాల్ ఆడుతోంది. ఆమెనే అమెరికాకు చెందిన 35 ఏళ్ల లోరా వెబ్‌స్టర్‌.
'సిట్టింగ్‌ వాలీబాల్‌' ఆడుతున్న ఈ పారా అథ్లెట్ ఐదో పతకం వేటలో చురుగ్గా పాల్గొంటుంది. ఇలా గర్భవతిగా ఉన్నప్పుడు పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తేమీ కాదు. గతంలో ఓసారి పారాలింపిక్స్‌లో, మరోసారి ఓ ఇంటర్నేషనల్ వేదికపై ఆమె గర్భంతోనే పోటీల్లో పాల్గొంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లైన లోరా నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. లోరా తొలిసారి ఏథెన్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత 2008, 2012 పారాలింపిక్స్‌ లో రజతాలు గెలుచుకుంది. గత రియో పారాలింపిక్స్‌లోఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికా జట్టు ఏకంగా స్వర్ణం గెలుచుకుంది. కాగా, లోరాకు 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్‌ కారణంగా ఎడమ కాలు దెబ్బతింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com