ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఐర్లాండ్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇతర ఫేస్బుక్ కంపెనీలతో వ్యక్తిగత డేటాను పంచుకున్నందుకు విచారణ జరిపిన తర్వాత గురువారం రికార్డు స్థాయిలో 225 మిలియన్ యూరోల (సుమారు 2 వేల కోట్లు) వాట్సాప్కు జరిమానా విధించబడింది. ఐర్లాండ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ DPC అంటే డేటా ప్రైవసీ కమిషనర్ ఈ జరిమానా విధించారు. అయితే, ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ జరిమానా పూర్తిగా అస్థిరంగా ఉందని , కంపెనీ అప్పీల్ చేస్తుందని రాయిటర్స్ వార్తల ప్రకారం తెలిపింది. వాట్సాప్ తన వినియోగదారులకు డేటా ఎలా ప్రాసెస్ చేస్తుంది అనే విషయాన్ని వారికి తెలియజేసేలా తగిన సమాచారం ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించిందని ఐరిష్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది.