ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భయపెడుతున్న కొత్త రకం కరోనా!

international |  Suryaa Desk  | Published : Tue, Aug 31, 2021, 01:44 PM

శాస్త్రవేత్తలు మరో కొత్త కరోనా వేరియంట్‌ ను గుర్తించారు. దక్షిణాఫ్రికాతో పాటు అనేక దేశాల్లో ఈ వేరియంట్ ను గుర్తించారు. ఈ వేరియంట్ ను ‘సి.1.2’గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ కు ఎక్కువగా వ్యాపించే శక్తి ఉందని, టీకాల ద్వారా లభించే రక్షణను ఏమార్చగల సామర్థ్యం ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.


దక్షిణాఫ్రికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ), క్వాజులు-నాటల్‌ రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ సీక్వెన్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ (క్రిస్ప్‌) శాస్త్రవేత్తలు ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దీన్ని ఈ ఏడాది మే నెలలోనే మొదటి సారి కనుగొన్నట్లు వారు చెప్పారు. ఈ వేరియంట్ చైనా, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, మారిషస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌లో కనిపించిందన్నారు. 2019 లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ కు ఇది చాలా భిన్నంగా ఉందని, ఇది త్వరగా వ్యాపించే ప్రమాదం ఉందని ప్రముఖ వైరాలజిస్టు ఉపాసన రే చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com