ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్గానిస్థాన్‌లో ఉక్రెయిన్‌ విమానం హైజాక్‌!

international |  Suryaa Desk  | Published : Tue, Aug 24, 2021, 02:15 PM

అఫ్ఘనిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్ కు గురైంది. అఫ్గాన్ నుండి తమ దేశ పౌరులను తీసుకెళ్లడానికి వచ్చిన విమానాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆయుధాలతో వచ్చి కాబుల్ ఎయిర్ పోర్టు నుండి హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ధ్రువీకరించారు. కాబుల్ నుండి ఇరాన్ తీసుకెళ్లినట్లుగా తమకు సమాచారం ఉందని చెప్పారు. తమ పౌరులకు బదులుగా అందులో ఇతర వ్యక్తులను తరలించినట్లుగా పేర్కొన్నారు. విమానం హైజాక్ చేసిన వారి వద్ద ఆయుధాలు ఉన్నట్లు వివరించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com