ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

national |  Suryaa Desk  | Published : Sat, Aug 21, 2021, 10:18 AM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, దీంతో ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. వారు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారని వెల్లడించారు. టెర్రరిస్టుల కోసం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com