ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టినరోజు వేడుకల్లో కత్తితో దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 19, 2021, 03:40 PM

పుట్టిన రోజు వేడుకలలో ఓ యువ కుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాజీవ్ గృహకల్ప వద్ద చోటు చేసుకుంది. మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్ గృహకల్పకు చెందిన కగ్గా రామ్ కుమార్, సూరి మరో ఆరుగురు యువకులు తమ స్నేహితుడు పుట్టిన రోజు సందర్భంగా ఎస్ఆర్ఐ ఆసుపత్రి వెనుక ఖాళీగా ఉన్న ప్లాట్ లలో పుట్టిన రోజు పార్టీ చేసుకున్నారు.


ఈ సందర్బంగా మద్యం సేవించిన రామ్ కుమార్, సూరి గొడవపడ్డాడు. వీరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర స్థాయిలో గొడవకు దారితీసింది. మిగిలిన యువకులు సర్దిచెప్పి అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయారు. అనంతరం సూరి రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న రామ్ కుమార్ ఇంటికి వెళ్లి బయట నిలబడి ఉన్న అతనిపై తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన రామ్ కుమార్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com