ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిడ్నీలో శరవేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్.. రంగంలోకి ఆర్మీ

international |  Suryaa Desk  | Published : Fri, Jul 30, 2021, 12:22 PM

ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. డెల్టా వేరియంట్ ఆ దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్నది. అయితే సిడ్నీలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ అయిదో వారానికి వెళ్లింది. అయినా వైరస్ కట్టడి కావడం లేదు. దీంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి ఆర్మీని దింపింది. సిడ్నీలో వందల సంఖ్యలో సైనికులు లాక్‌డౌన్ అమలు చేసేందుకు విధులు నిర్వర్తిస్తున్నారు. జూన్‌లో అక్కడ మూడువేల మందికి ఇన్‌ఫెక్షన్ సోకింది. 9 మంది మరణించారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చి అయిదు వారాల గుడుస్తున్నా.. సిడ్నీలో వైరస్ అదుపులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా శుక్రవారం మరో 170 కేసులు నమోదు అయ్యాయి.


లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దింపడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆగస్టు 28వ తేదీ వరకు సిడ్నీలో లాక్‌డౌన్ విధించారు. ఆస్ట్రేలియా రక్షణ దళాలు ఇక నుంచి సిడ్నీలో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. హాట్‌స్పాట్‌లను ఎంపిక చేసి అక్కడ వైరస్ నియంత్రణ కోసం కావాల్సిన చర్యలను తీసుకుంటారు. చాలా కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఆస్ట్రేలియా మెడికల్ అసోసియేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు వ్యాక్సినేషన్ వేగాన్ని కూడా పెంచాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com