ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలుడి పనికి సీఎం స్టాలిన్ ఫిదా!

national |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 01:57 PM

ఏడేళ్ల బాలుడి పనికి సీఎం స్టాలిన్ ఫిదా అయ్యారు. ఆ బాలుడు ఉదారత్వానికి ముచ్చట పడ్డ ముఖ్యమంత్రి ఆ చిన్నారికి ఓ కానుక కూడా పంపారు. అలాగే ఫోన్ లో మాట్లాడి ముచ్చటించారు. స్వయంగా సీఎం ఫోన్ లో మాట్లాడటంతో ఆ బాలుడు సంతోషంతో ఉబ్బితబ్బి పోతున్నాడు. మదురైకి చెందిన ఎలక్ట్రీషియన్ ఇళంగో కుమారుడు హరీశ్ వర్మన్ సైకిల్ కొనుక్కోవడం కోసం గత రెండేళ్ల నుంచి తన పాకెట్ మనీని దాచుకుంటున్నాడు. అయితే ఇటీవల కొవిడ్ విజృంభించడంతో ఆ బాలుడి మనసు చలించింది.


తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీప్ ఫండ్ కు పంపించాడు. తన డబ్బుతో కరోనా రోగికి వైద్యం అందించాలని కోరుతూ సీఎంకు లేఖను కూడా రాశాడు. అయితే ఆ బాలుడు ఉదార స్వభావానికి సీఎం స్టాలిన్ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో మంచి మనసుతో ముందుకు వచ్చిన హరీష్ పనికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఫిదా అయ్యారు. ఆ పిల్లవాడికి సైకిల్‌ను బహుమానంగా పంపించారు. పార్టీ నేతలు సీఎం పంపిన ఆ కానుకను బాలుడికి అందజేశారు. అంతే కాకుండా ఆ బాలుడితో స్టాలిన్ ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు హరీష్ చెప్పారు. తన చదువు వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నట్లు ఆ బాలుడు తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com