ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం ట్విటర్ అకౌంట్ హ్యాక్

national |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 05:43 PM

తమిళనాడు ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో ఐటీ నిపుణులు ఆ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ భారీ మెజార్టీతో గెలిచి ఈ నెల 7వ తేదీన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం పళనిస్వామి ట్విటర్‌ అకౌంట్‌ను స్టాలిన్‌కు బదిలీ చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. ఆ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం అధికారిక సమాచారాన్ని స్టాలిన్ అకౌంట్‌ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ సమస్యలకు కొద్దిరోజుల్లోనే పరిష్కారం చూపుతామని ఐటీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లోనూ ఇదే లోపం నెలకొంది. తమిళనాడు సీఎం అధికార ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఫోటో, పేరు, ఇతర వివరాలే కనిపిస్తున్నాయి. దీనిపై డీఎంకే ఐటీ విభాగం కార్యాలయ అధికారి మాట్లాడుతూ ..‘రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత తమిళనాడులో ప్రభుత్వం మారడం ఇదే మొదటిసారి’అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com