ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కాల్పులు..

international |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 08:29 AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలో వేర్వేరు చోట్ల కాల్పుల్లో 12 మంది మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి కొలరాడో పార్క్ లో పుట్టిన రోజు వేడుకల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. కొలరాడో కాల్పుల్లో ఏడుగురు మృతిచెందారు. ఉడ్‌ల్యాండ్‌లో పొరుగువారిపై ఓ వ్యక్తి కాల్పులు జరుపడంతో ముగ్గురు మృతి చెందారు. నిందితుడిపై పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే కాల్పులకు గల కారణాలేమిటో తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా, అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎన్​వైపీడీ కమిషనర్ డెర్మోట్ సియా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com