ఘోర రైలు ప్రమాదం.. 13 మంది మృతి

  Written by : Suryaa Desk Updated: Tue, May 04, 2021, 12:20 PM
 

మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. మెట్రో వంతెన కూలిపోయి రైలు బోగీలు కింద పడ్డాయి. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 70 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.