ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బురఖాలపై మంత్రివర్గం కీలక నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Wed, Apr 28, 2021, 02:10 PM

బహిరంగ ప్రదేశాల్లో బురఖాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున 9 మంది ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై వరుస బాంబుపేలుళకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ముసుగులు ధరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో దేశంలో ఇకపై ముఖాన్ని పూర్తిగా కప్పే ముసుగులు ధరించరాదని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుతం కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కులకు ఈ నిబంధన వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే ఇది ఈ కొత్త రూల్ చట్టంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com