ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాదం గింజలు తింటే ఎన్నో ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 28, 2021, 02:03 PM

బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


- బాదం పప్పులో ‘విటమిన్‌-ఇ’ పుష్కలంగా ఉంటుంది. అది శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ డ్యామేజీని తగ్గిస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
- బాదం పప్పులో ఫైబర్‌ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, కడుపుబ్బరం దూరమవుతాయి.
- బాదం గింజల్లో క్యాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. అవి గుండె, ఎముకల సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
- బాదం గింజల్లోని పొటాషియం బ్లడ్‌ ప్రెషర్‌ సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- బాదం గింజల్లోని మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com