ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి భారీ జరిమానా

international |  Suryaa Desk  | Published : Tue, Apr 27, 2021, 12:03 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదేశించింది.


మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే 20 వేల భట్‌లు (భారత కరెన్సీలో దాదాపు 48 వేల రూపాయల) వరకు జరిమానా విధించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని వ్యాక్సినేషన్ కు సంబందించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా మాస్క్ ధరించి ఉండగా ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఓచా మాత్రం మాస్క్ పెట్టుకోలేదు.


ఈ ఫోటోలను ప్రధాని వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో విషయం వెలుగుచూసింది. ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాని మాస్క్ పెట్టుకోకపోవడంతో అతడికి జరిమానా విధించారు అధికారులు. తోలి ఉల్లంఘన కాబట్టి 6 వేల భట్‌లు (రూ.14,250) జరిమానా విధించారు. ఈ విషయంపై బ్యాంకాక్‌ నగర గవర్నర్‌ అశ్విన్‌ క్వాన్‌మువాంగ్‌ స్పందించారు. ప్రధానిని నుంచి దర్యాప్తు అధికారులు జరిమానా వసూలు చేశారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com