ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీలోని పరిశోధకుల టీమ్ శుభవార్త చెప్పింది. మలేరియాకు వ్యాక్సిన్ కనుగొంటున్నట్లు తెలిపింది. కొంత మంది పార్ట్నర్లూ కలిసి... R21/Matrix-M అనే మలేరియా వ్యాక్సిన్ తయారుచేశారని ఓ రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం అది llb దశ ట్రయల్ జరుపుకుంటోంది. ఈ దశలో అది 12 నెలలుగా 77 శాతం ఎఫికసీ (Efficacy) చూపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఎఫికసీ 75 శాతం ఉండాలి. ఇది మరో 2 శాతం ఎక్కువే ఉంది కాబట్టి... ఇది ప్రపంచ మొదటి మలేరియా వ్యాక్సిన్ కాబోతోందని అనుకోవచ్చు. కరోనా వల్ల కొంపలు మునుగుతున్నాయి కాబ్టటి ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చేశాయి. మలేరియా వ్యాక్సిన్‌కి అలా వెంటనే అనుమతులు ఇవ్వరు. ఇంకో రెండేళ్లపాటూ పరిశోధనలు కొనసాగిస్తారు. మరిన్ని ట్రయల్స్ జరుపుతారు. ఆ తర్వాతే అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేస్తున్న పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా డీల్ కుదుర్చుకుంది. ఏడాదికి 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని తెలిపింది. ఈ వ్యాక్సిన్‌కి అనుమతి లభిస్తే వర్షాకాలానికి ముందు దీన్ని ప్రజలు తీసుకోవచ్చు. దాంతో మలేరియా రాకముందే ప్రజల బాడీలో దాన్ని ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తర్వాత దోమలు మలేరియాను వ్యాపింపజేసినా ఏమీ కాదు. వాటి ప్లాన్ ఫెయిల్ అవుతుంది.