ఓ మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చి.. తన భర్త తండ్రిని పెళ్లి చేసుకుంది. ఈ విచిత్ర సంఘటన అమెరికాలో జరిగింది. కెంటుకీలో హారోడ్స్బర్గ్ ప్రాంతంలో నివసిస్తున్న ఎరికా క్విగ్లే(31)కు జెఫ్(60) సవతి కుమారుడు జస్టిన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో కొన్నేళ్ల క్రితం వారు వివాహం చేసుకున్నారు.
ఎరికా, జస్టిన్ లకు ఓ బిడ్డ పుట్టాడు. కొన్నాళ్ల తర్వాత సంసారంలో గొడవలు వచ్చాయి. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎరికా.. జస్టిన్ సవతి తండ్రి జెఫ్ తో ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఎరికా.. ఆమెకు పుట్టిన బిడ్డ బాధ్యతలను తన మాజీ భర్త జస్టిన్ కే అందించింది. ఆ ముగ్గురు ఇప్పుడు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. ఈ సందర్భంగా జస్టిన్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మేమంతా బాగానే ఉన్నాం. ఎరికా మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆమె ఫీలింగ్స్‌ని నేను అర్థం చేసుకున్నాను’’ అని అన్నాడు.
జెఫ్ మాట్లాడుతూ.. ‘‘నేను, ఎరికా ప్రతిక్షణం ఆనందంగా గడుపుతున్నాం. మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడాని మేం పట్టించుకోవడం లేదు’’ అని తెలిపాడు.