శ్రీలంక దిగ్గజ స్పిన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురలీధరన్ అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు సడెన్ గా గుండె సంబంధిత సమస్య రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. యాంజియోప్లాస్టీ సర్జరీ చేసి స్టెంట్ అమర్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ముత్తయ్య 2015 నుంచి ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.