కరోనా ప్రభావంతో ఓ యువతి పెళ్లి రద్దు అయ్యింది. దీంతో ఆమె తన పెళ్లి గౌను ధరించి వచ్చి వ్యాక్సిన్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని బాల్టిమోర్ కు చెందిన సారా స్టడ్లీ అనే యువతి పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మరికొన్నిరోజుల్లో పెళ్లి జరుగుతుందనగా.. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సారా పెళ్లి రద్దయిపోయింది. దీంతో కరోనా నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆమె పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న తెల్లటి గౌనును ధరించి టీకా సెంటర్ కు వెళ్లింది. పెళ్లి గౌనులో ముస్తాబై రావడంతో అక్కడున్న సిబ్బంది ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత విషయం తెలిసి బాధపడి.. వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి గౌనులో వచ్చిన సారా స్టడ్లీని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సిస్టం క్లినిక్ సిబ్బంది ఫొటోలు తీసి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో సారా స్టడ్లీ ఫొటోలు వైరల్గా మారాయి.