కెనడా పార్లమెంట్ కు చెందిన ఎంపీ విలియమ్ ఆమోస్.. జూమ్ కాల్ లో నగ్నంగా కనిపించాడు. ఈ ఘటనతో తోటి పార్లమెంట్ సభ్యులు షాకయ్యారు. అయితే జూమ్ వీడియో కాల్ లో నగ్నంగా కనిపించిన ఘటన పట్ల ఎంపీ విలియమ్ ఆమోస్ క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఇలా జరిగిందని ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. విలియమ్ ఆమోస్ ది క్యూబెక్ జిల్లాలోని పాంటియాక్ నియోజకవర్గం. జాగింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత అతడు దుస్తులు మార్చుకుంటున్న సమయంలో జూమ్ వీడియో అకస్మాత్తుగా ఆన్ అయ్యింది. దీంతో తాను నగ్నంగా కనిపించానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తనను ఇబ్బందికి గురి చేసిందని ఎంపీ అన్నారు. నిజాయితీగా తప్పును ఒప్పుకుంటున్నానని, ఇంకోసారి ఇలా జరగనివ్వనని అన్నారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఈ ఘటన పట్ల ఇంకా స్పందించలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు.