ట్రెండింగ్
Epaper    English    தமிழ்

90 ఏళ్ల వయసులో జాబ్... గిన్నిస్ రికార్డు...

international |  Suryaa Desk  | Published : Mon, Apr 12, 2021, 08:01 AM

జపాన్ ‌కు చెందిన యసుకో తమాకి అనే బామ్మ 90 ఏళ్ల వయసులోనూ ఆఫీస్‌కు వస్తూ, అందరిలానే పని చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రపంచంలోని ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్ ‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. తమాకి 1930 లో జన్మించింది. 1956 నుంచి సన్‌కో ఇండస్ట్రీస్‌లో పనిచేస్తోంది. 65 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమాకి.. ఇంకా యాక్టివ్ ‌గా పనిచేస్తోంది. సన్‌కో కంపెనీని 1948లో స్థాపించగా, 8 ఏళ్ల తర్వాత అందులో ‘ఆఫీస్ అకౌంటెంట్’‌ గా తమాకి విధుల్లో చేరింది. ఇప్పటికీ తన మైండ్‌లో రిటైర్‌మెంట్ ఆలోచన లేదంటోంది. తమాకిని గిన్నిస్ బుక్ సంస్థ ‘ఓల్డెస్ట్ ఆఫీస్ మేనేజర్’గా గుర్తించి, ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com