కలిసి ఉండగా చూశాడని దారుణం

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 06:57 PM
 

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక తమ్ముడిని(6 ఏళ్లు) ఆమె 21 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండడాన్ని చూడడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ ఘటన జరిగింది. బాలికతో తనకున్న సంబంధాన్ని బయటపెటతాడన్నభయంతో నిందితుడు బాలుడిని గొంతు కోసి చంపాడని పోలీసులు తెలిపారు. మొదట తన తమ్ముడు ఇంటిపై కప్పు నుంచి జారీ పడ్డాడని నమ్మించే ప్రయత్నం చేసిన బాలిక.. తర్వాత తల్లిదండ్రులకు నిజం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది.