చైనా, రష్యా వ్యాక్సిన్ ను తాము ఉపయోగించేది కష్టమేనంటున్న అమెరికా!

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 06:53 PM
 

అమెరికాలో చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అంటురోగాల విభాగం నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా, రష్యా దేశాలు తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై ఆందోళన వ్యక్తం చేశారు.చైనా, రష్యా వంటి ఇతర దేశాలు రూపొందించే వ్యాక్సిన్లను అమెరికా ఉపయోగించబోదని భావిస్తున్నట్టు తెలిపారు. పాశ్చాత్య దేశాల కంటే ఆయా దేశాల్లో ఔషధ నియంత్రణ వ్యవస్థలు పారదర్శకతకు దూరంగా ఉంటాయని, ఇలాంటి దేశాల్లో తయారైన కరోనా వ్యాక్సిన్ ను అమెరికా వినియోగించడం కష్టమేనని ఫౌచీ అభిప్రాయపడ్డారు. కాగా, కరోనా వ్యాక్సిన్ కోసం అమెరికా అనేక దేశీయ ఫార్మా సంస్థలకు భారీగా నిధులు గుమ్మరిస్తోంది. సనోఫీ, జీఎస్కే వంటి దిగ్గజ ఫార్మాసంస్థలకు 2.1 బిలియన్ డాలర్లు అందిస్తోంది.