ఒక్క సినిమా కూడా ఆడని.. సినిమా థియేటర్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 06:24 PM
 

ఎడారిలో నీళ్లు దొరకడమే కష్టం.. అలాంటిది పెద్ద ఓపెన్ సినిమా థియేటర్‌ ఉంది తెలుసా..? ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి చాలా డబ్బు వెచ్చించి దీనిని నిర్మించాడు.ఈజిప్టు ఎడారి మధ్యలో ఈ సినిమా థియేటర్ ఉంది. సినాయ్ ద్వీపకల్పంలోని దక్షిణ కొనపై ఎక్కడో, ఎడారి పర్వత శ్రేణి పాదాల దగ్గర ఉంది. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా అందులో ఆడలేదు. వందలాది కుర్చీలు, సకల సదుపాయాలు ఇందులో ఉన్నాయి. కైరో నుంచి సీట్లు, జనరేటర్‌ను తెప్పించి ఈ థియేటర్‌లో అమర్చారు. పెద్ద తెరను ఏర్పాటు చేశారు. అయితే మొదటి సినిమా ప్రివ్యూ రోజునే జనరేటర్ మధ్యలో మొరాయించింది. కరెంట్ కట్ అయింది. దీంతో అప్పుడు సినిమా వేయడం అవ్వలేదు.ఇలాంటి ప్రదేశంలో థియేటర్ కట్టడమే చాలా కష్టమైన పని. తొలి ప్రదర్శన ఫెయిలయ్యేసరికి.. మొత్తంగా మూతబడింది. తర్వాత కూడా ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో అప్పట్నుంచి.. ఇక్కడ ఆ కుర్చీలు, ప్రొజెక్టర్ స్క్రీన్ ఇలా అన్నీ శిథిలమైపోతున్నాయి. ఒక్క సినిమా కూడా ఆడకుండా ఈ థియేటర్ శిథిలావస్థకు చేరుకుంది. గూగుల్ మ్యాప్స్‌లో మనం ఈ థియేటర్‌ను చూడొచ్చు.