అమెరికాలో టిక్ టాక్ బ్యాన్

  Written by : Suryaa Desk Updated: Sat, Aug 01, 2020, 06:08 PM
 

టిక్ టాక్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో టిక్ టాక్ ను బ్యాన్ చేయనునట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా జాతీయ భద్రత, వ్యక్తిగత ప్రైవసీని పరిగణలోకి తీసుకుని టిక్ టాక్‌ను బ్యాన్ చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై తాను శనివారం సంతకం చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పటికే టిక్ టాక్ ను భారత్ బ్యాన్ చేసింది. ఇప్పుడు భారత్ బాటలోనే అగ్రరాజ్యం కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేయబోతుంది. టిక్ టాక్ యూజర్ల సమాచారాన్ని చైనాతో టిక్ టాక్ పంచుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు దేశాలు టిక్ టాక్ ను బ్యాన్ చేసే యోచనలో ఉన్నాయి. అమెరికా కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో టిక్ టాక్ గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.