భారత్ 59 యాప్ లను నిషేధించడంతో షాక్ లో ఉన్న చైనాకు దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ గట్టి షాక్ ఇచ్చింది. చైనీస్ యాప్ స్టోర్‌లోని 4500 మొబైల్ గేమ్స్‌ను యాపిల్ తొలగించింది. గడిచిన మూడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో గేమ్స్‌ను తొలగించడంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గేమింగ్ లైసెన్స్ నింబంధనల్లో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన యాపిల్ అందులో భాగంగానే చైనా గేమ్స్‌ను తొలగించామని ప్రకటించింది. లైసెన్స్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని గతేడాదే తాము చెప్పినట్లు గుర్తుచేసింది. అందులో భాగంగానే ముందుగా విధించిన గడువు ప్రకారం జూన్ 30 నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్ నుంచి తొలగిస్తున్నామని యాపిల్ కంపెనీ ఆదివారం ఓ ప్రకటనన విడుదల చేసింది.