ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు శుభవార్త..ఎస్‌బీఐలో 431 ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 04:59 PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను ఎస్బీఐ విడుదల చేసింది. మొత్తం 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని ప్రకటించింది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఫ్యాకల్టీ, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 13 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను www.sbi.co.in/web/careers వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.


మొత్తం 431 ఖాళీలు


ఎగ్జిక్యూటీవ్ (FI & MM) - 241,


సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85,


సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2,


సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2,


సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2,


హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1,


సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1,


సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1,


ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9,


ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (టెక్నాలజీ)- 1,


రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48,


రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3,


ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20,


ప్రొడక్ట్ మేనేజర్- 6,


మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2,


మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1,


ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3,


బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1,


మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1,


వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1,


చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3,


డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3,


డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1,


డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8,


చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1


విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.


జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.


దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


మరిన్ని వివరాలకు www.sbi.co.in/web/careers/current-openings వెబ్‌సైట్ చూడొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com