ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆవు పేడ కొనుగోలుకు సిద్దమైన ప్రభుత్వం...

national |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 01:09 PM

ఆవు పేడ కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు, పశుసంపద వృద్ధి చేసేందుకు ప్రారంభించిన గోధన్ న్యాయ్ పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సేకరించిన పేడను వర్మీకంపోస్ట్ సేంద్రియ ఎరువు తయారీలో వినియోగించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం భూపేశ్ భాఘేల్ ఈ సందర్బంగా తెలిపారు. స్వయం సహాక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా ఓ కార్డు కూడా జారీ అవుతుందని, పేడ కోనుగోలు తేదీని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా గోధన్ కమిటీలు ఏర్పాటవుతాయి. నగరంలో పురపాలక సంఘాలు, ఇతర అటవీ శాఖ కమిటీలు వాటి వాటి పరిధిలో ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com