ఓ బొద్దింక మహిళ చెవిలో కాపురం పెట్టేసింది. ఆ విషయం ఆమెకు కూడా తెలియదు. ఇటీవల చెవిలో ఎవరో గోకుతున్నట్లుగా శబ్దాలు రావడం, గిలిగింతలుగా అనిపించడంతో ఇయర్ బడ్స్‌తో చెవిని క్లియర్ చేసుకోడానికి ప్రయత్నించింది. అప్పటికీ చెవిలో ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఆమె వైద్యులను ఆశ్రయిస్తే అసలు విషయం తెలిసింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెవిలో బొద్దింక ఉందని చెప్పారు. ఆ బొద్దింక ఇంకా బతికే ఉందని, చెవిలో అటూ ఇటూ తిరుగుతుందని తెలియడంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చైనాలోని గుయంగ్డోంగ్లోని జుహై ప్రాంతానికి చెందిన ఆ మహిళకు డాక్టర్లు ధైర్యం చెప్పి ఒటోస్కోప్ విధానంలో చెవిలోని బొద్దింకను బయటకు తీసేశారు.