ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటు సారా విక్రయదారుడు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 02:17 PM

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ సమీపంలో ఒక వ్యక్తి వద్ద నుండి నాటుసారా 15 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఓర్వకల్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన బుడబుక్కల సుభాష్ అనే వ్యక్తి నాటు సారా అమ్మకం జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు అతనిని తడకనపల్లె గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com