ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెడ్రూమ్‌లో బావి..30 అడుగుల గోతిలో పడ్డ వ్యక్తి!

international |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 01:24 PM

అమెరికాలోని కనెక్టికట్‌లోని ఓ ఇంట్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నూతిలో పడిపోయాడని.. రక్షించాలని అవతలి వ్యక్తి చెప్పాడు. టిఒఐ కథనం మేరకు.. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో సహా ఆ ఇంటికి వెళ్లారు. కానీ, అక్కడ బావి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఫిర్యాదు చేసిన వ్యక్తి పోలీసులను ఇంటి లోపలికి రావాలని తెలిపాడు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఆశ్చర్యపోయారు. బావి ఇంటి లోపల ఉంది. పైగా అది 30 అడుగుల లోతు ఉంది. నూతిలో పడిపోయిన బాధితుడు ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన వ్యక్తి స్నేహితుడు. బెడ్రూమ్‌లో సామాన్లు సర్దుతున్న సమయంలో ఫ్లోర్ ఒక్కసారే విరిగింది. దీంతో అతడు నేరుగా 30 అడుగుల లోతు గల బావిలో పడిపోయాడు. అందులో సుమారు 6 అడుగుల పైన నీళ్లు ఉన్నాయి. అవి చాలా చల్లగా ఉన్నాయి.దీంతో బాధితుడు ఆ బావిలో నరక యాతన అనుభవించాడు. చిమ్మ చీకట్లో భయం భయంగా కాలం గడిపాడు. సుమారు 25 నిమిషాలు వరకు అతడు అందులోనే ఉన్నాడు. అగ్నిమాపక సిబ్బంది సాధారణ బావి అని భావించారు. అయితే, ఆ బావి సుమారు 30 అడుగుల లోతు ఉండటంతో వారి వద్ద ఉన్న తాళ్లు, సిబ్బంది సామర్థ్యం సరిపోలేదు. దీంతో మరొక టీమ్ అక్కడికి వచ్చింది. ఒకరు తమ నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగారు. బాధితుడిని బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో బాధితుడికి పెద్దగా గాయాలేవీ కాలేదు. అయితే, ఎక్కువ సేపు చల్లని నీళ్లలో ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యాడు. ఇంట్లో అంత పెద్ద బావి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తే.. అది పురాతన కట్టడమని తెలిసింది. ఆ ఇంటిని 1843లో నిర్మించారని, అప్పుడు ఆ బావి ఇంటికి బయటే ఉండేదని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com