ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేషన్ లో ఎస్సై అసభ్య ప్రవర్తన..

national |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 12:19 PM

న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన మహిళల ముందు ఓ ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాధితురాలు సీక్రెట్ కెమెరాలతో అతడి ప్రవర్తనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టింది. దీంతో ఉన్నతాధికారులు ఆ పోలీసును సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ డియోరియాలోని భట్ని పోలీస్‌ స్టేషన్‌ కు ఓ మహిళ తన కూతురుతో కలిసి భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్‌ ఫిర్యాదు గురించి మాట్లాడాలంటూ ఆ మహిళను,కూతురిని తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ వారి ఎదురుగా హస్త ప్రయోగం చేసుకుంటూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళ,ఆమె కూతురు షాకయ్యారు. మహిళ కూతురు దైర్యం చేసి రహస్యంగా వీడియో తీసింది. అతడి లీలలను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో ఉన్నతాధికారుల వరకు వెళ్లడంతో వారు అతడిని సస్పెండ్‌ చేశారు. ఇలాంటి వాళ్లు మళ్లీ ఖాకీ డ్రస్సు వేసుకోకుండా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com