ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంజినీరింగ్ చేయాలనుకునే విద్యార్థినులకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 30, 2020, 01:42 PM

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్ఢీఓ, ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్కాలర్‌షిప్స్ ప్రకటించింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్, రాకెట్రీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ విభాగాల్లో చదువుతున్న అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ ను డీఆర్‌డీఓ అందిస్తోంది. ఎంపికైన అమ్మాయిలకు ఏటా రూ.1,86,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఆసక్తి గల విద్యార్థినులు డీఆర్‌డీఓకు చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్-ఆర్ఏసీ, వెబ్‌సైట్ rac.gov.in/ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 19న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 30వ చివరి తేదీ. భారత్ కు చెందిన అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com