డేవిడ్ వార్నర్‌ను ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ ట్రోల్ చేస్తూ విడుదల చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తేలిసిందే. వాటిలో టిక్ టాక్ తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకున్న యాప్. చాలా మంది ఈ యాప్ ద్వారా పాపులరిటీ సంపాదించుకుని స్టార్లుగా మారారు.
అయితే నిషేధిత జాబితిలో ఈ యాప్ ఉండడంతో టిక్‌టాక్ స్టార్లపై ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలానే వార్నర్‌ను కూడా అశ్విన్ ట్రోల్ చేశాడు. చైనా యాప్‌ల నిషేధానికి సంబంధించిన ట్వీట్‌ను అశ్విన్ షేర్ చేస్తూ వార్నర్‌కు ట్యాగ్ చేశాడు. 'అప్పో అన్వర్?' అంటూ ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కొద్ది గంటల్లోనే 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి