ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NFL జాబ్స్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ జూన్ 30

national |  Suryaa Desk  | Published : Sun, Jun 28, 2020, 12:18 PM

నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL 52 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాక్ డౌన్ కారణంగా దరఖాస్తు గడువును జూన్ 30 వరకు దరఖాస్తు పొడిగించింది. ఇంజనీర్, మేనేజర్, సీనియర్ కెమిస్ట్ లాంటి పోస్టులున్నాయి.
52 ఖాళీల్లో ఇంజనీర్ (ప్రొడక్షన్)- 1, మేనేజర్ (ప్రొడక్షన్)- 16, ఇంజనీర్ (మెకానికల్)- 5, మేనేజర్ (మెకానికల్)- 12, ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 3, మేనేజర్ (ఎలక్ట్రికల్)- 2, ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 5, ఇంజనీర్ (సివిల్)- 1, సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్)- 6, ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ)- 1 పోస్టులున్నాయి.
వివిధ పోస్టులకు వివిధ విద్యార్హతలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ లాంటి విభాగాలకు బీటెక్, బీఈ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు ఫీజు రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: General Manager (HR), National Fertilizers Limited, A-11, Sector-24, Noida, District Gautam Budh Nagar, Uttar Pradesh – 201301.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com