అసోంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా టిన్సుకియాలోని డమ్‌డమ్ ఏరియాను భారీ వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. టిన్సుకియాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా పరిసరాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వీధుల్లో నడుములోతు నీరు నిలువడంతో ఇండ్లు నీట మునిగాయి.