ఏపీలో కొత్తగా 553 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కరొనతో ఏడుగురు మృతి చెందారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 69 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884 కి చేరింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 136కి చేరింది. డిశ్చార్జ్ అయినవారు 4988 మంది, యాక్టివ్ కేసుల సంఖ్య 5,760 గా ఉంది.