ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 256 ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 04:27 PM

ఇంటర్ పాసైనవారికి శుభవార్త. ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2020 జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 14 చివరి తేదీ. మొత్తం 256 ఖాళీలను ప్రకటించింది ఐఏఎఫ్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వనుంది. పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను afcat.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


మొత్తం ఖాళీలు- 256


ఫ్లయింగ్ బ్రాంచ్- 74


గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105


గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 55


మెటరాలజీ- 22


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 15


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 14


అడ్మిట్ కార్డుల విడుదల- 2020 సెప్టెంబర్ 4


పరీక్ష తేదీ- 2020 సెప్టెంబర్ 19


శిక్షణ ప్రారంభం- 2021 జూలై


విద్యార్హత- ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.


దరఖాస్తు ఫీజు- రూ.250


వెబ్‌సైట్: afcat.cdac.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com