ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐవీఎఫ్ తో మరో అద్భుతం

international |  Suryaa Desk  | Published : Mon, Jun 22, 2020, 02:22 PM

పైన చూడగానే ఇదేదో ఫేక్ న్యూస్ అనుకుంటున్నారా? కాదండి ఇది నిజం. కాక పోతే ఈ ఘటన జరిగింది మన ఇండియాలో కాదు మనతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాలో. ఎప్పుడో పదేళ్ల కిందట 2009లో వాంగ్ అనే మహిళకు పిల్లలు పుట్టని సమస్య ఉంటే... IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) విధానం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 2009 అక్టోబర్‌లో డాక్టర్లు ఆమె నుంచి అండాలను సేకరించి ట్రీట్‌మెంట్ చేసి... తిరిగి ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టారు. 2010 జూన్‌లో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లాడికి లులు అని నామకరణం చేశారు. ఆమె నుంచి సేకరించిన అండాలను వైద్య సిబ్బంది ఫ్రీజర్‌లో భద్రంగా దాచారు. దాదాపు పదేళ్ల తర్వాత 41 ఏళ్ల వయస్సులో ఆమె రెండో బిడ్డ కావాలని భావించింది.వెంటనే అప్పటి డాక్టర్లను కలిసింది. మొదటి సారి సేకరించిన అండాలను తిరిగి ఆమె శరీరంలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జూన్ 16న మరోసారి ఆమె రెండో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి టాంగ్టాంగ్ అనే నామకరణం చేశారు. పదేళ్ల కిందట పుట్టిన బిడ్డ బరువు 3.48 కేజీల బరువు కాగా... ఈ సారి పుట్టిన బిడ్డ కూడా అంతే బరువు ఉన్నాడు. ఇద్దరూ కవలలే కావడం వల్ల ఇలా సాధ్యమైందని వైద్యు నిపుణులు చెప్పారు. వైద్య పరిభాషలో లులు, టాంగ్టాంగ్ ఇద్దరూ కవలల కిందే లెక్క కావడం విశేషం. ఇద్దరు పిల్లలూ పుట్టింది జూన్ నెలలోనే కావడం మరో విశేషం. ఇలాంటి కేసులు అరుదుగా వస్తుంటాయని వైద్యులు చెప్పారు. ఐవీఎఫ్ విధానం జరిగే అద్భుతాలకు ఇదో ఉదాహరణ అని వైద్యులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com