ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏరియా 51లో ఏలియన్స్?.. ఇప్పటికీ వీడని మిస్టరీ

international |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 05:00 PM

అమెరికాలోని నెవడా రాష్ట్రంలో లాస్ వెగాస్‌‌కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉన్న మిలటరీ బేస్‌నే ‘ఏరియా 51’ అని అంటారు. ‘నెవడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్’ పేరుతో చెలామణి అవుతున్న ఈ ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండా ఎలాంటి హెలికాప్టర్లు, విమానాలు, డ్రోన్లు ఎగరలేవు. ఒకవేళ అక్కడ పొరపాటున అడుగుపెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది.1950లో నెవడా మిలటరీ బేస్‌లో గుర్తుతెలియని యూఎఫ్‌వోలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. అప్పటి నుంచి అమెరికా ప్రజలు ఆ ప్రాంతంలో ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) దిగి ఉంటారని భావించేవారు. అమెరికా సైన్యం 1955లో ఆ ప్రాంతం మీదుగా రహస్య నిఘా విమానాలను ప్రయోగించేది. వాటిని చూసి ప్రజలు అక్కడ నిజంగానే గ్రహాంతరవాసులు సంచరిస్తున్నాయని అనుమానించేవారు. వైమానిక దళం ప్రత్యేకంగా బేస్ ఏర్పాటుచేసి ప్రయోగాలు చేపట్టడంతో అక్కడ ఏలియన్స్‌పై పరిశోధనలు జరుగుతున్నాయనే వదంతులు వ్యాపించాయి.1959లో ఏరియా 51కు కొంతదూరంలో ఆకాశంలో యుఎఫ్‌వో కనిపించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా రెండు మూడుసార్లు ఆ యూఎఫ్‌వోలు ప్రత్యక్షమైనట్లు నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు కూడా సమాచారం అందింది. అలాగే 1947లో న్యూ మెక్సికోలోని రాస్వేల్‌లో యూఎఫ్‌వో కూలినట్లు వదంతులు వచ్చాయి. ఆ తర్వాత చాలాసార్లు ఆ ప్రాంతంలో యూఎఫ్‌వోలు కనిపించినట్లు సమాచారం. అయితే, ఆ వార్తలు ఎంతవరకు వాస్తవం అనేది తెలియరాలేదు. ఇప్పటికీ ఏరియా 51 ప్రాంతంలో నివసించే ప్రజలు తమకు యూఎఫ్‌వోలు కనిపిస్తున్నాయని తెలుపుతున్నారు. అయితే, ‘ఏరియా 51’లో ఏం జరుగుతుందనేది ఇప్పటికీ రహస్యమే. ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిపోయింది. దీనిపై అమెరికా సైన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com