ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభణ

international |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 09:36 AM

న్యూయార్క్‌: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నది. ప్రతి రోజు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తే వైరస్‌ విజృంభన ఇప్పట్లో తగ్గేలా కనిపించడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 85,78,052 మంది ఈ వైరస్‌బారిన పడ్డారు. ప్రాణాంతక వైరస్‌ వల్ల 4,56,284 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 45,30,261 మంది  కోలుకోగా, మరో 35,91,507 మంది చికిత్స పొందుతున్నారు. 


కరోనా కేసుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికాలో ఇప్పటివరకు 22,63,651 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడిన 1,20,688 మంది మరణించారు. ఇంకా 12,11,969 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 9,30,994 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం 9,83,359 పాజిటివ్‌ కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నది. దేశంలో ఇప్పటివరకు 47,869 మంది మరణించగా, 5,20,360 మంది కోలుకున్నారు. మరో 4,15,130 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


 


రష్యాలో మొదట్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, మాస్కో కేంద్రంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. దీంతో దేశంలో ఇప్పటివరకు 5,61,091 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 7660 మంది మరణించారు. మొత్తం నమోదైన కేసుల్లో 2,39468 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,13,963 మంది బాధితులు కోలుకున్నారు. నాలుగో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటివరకు 3,81,091 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల దేశంలో 12,604 మంది మరణించగా, 2,05,182 మంది కోలుకున్నారు. మరో 1,63,305 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3 లక్షల 469 కేసులతో యూకే ఐదో స్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 42,288 మంది మృతిచెందారు. మెక్సికోలో నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 5662 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 667 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,65,455కు చేరగా, మృతులు 19,747కి పెరిగింది. 


అత్యధిక కరోనా కేసుల జాబితాలో స్పెయిన్‌ (2,92,348 కేసులు), పెరూ (2,44,388), ఇటలీ (2,38,159), చిలి (2,25,103), ఇరాన్‌ (1,97,647 కేసులు) ఆరు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com