ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా టీకా రెడీ అంటున్న చైనా

international |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 02:05 PM

కరోనా మహమ్మారిని కట్టడి కోసం వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి చైనాలోని ఔషధ తయారీ సంస్థ సినోవ్యాక బయోటెక్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే దిశగా సాగుతున్నాయి. తమ ప్రయత్నాలు ఫలించి మందు మార్కెట్లోకి వస్తే వేల ప్రాణాలు నిలువరించిన వారమవుతామని ఆ సంస్థ ఇటీవల పేర్కొన్నది. తాము తయారు చేసిన టీకా సానుకూల ఫలితాలను ఇస్తున్నదని సినోవ్యాక్ బయోటెక్ తెలిపింది. మానవులపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ టీకా మొదటి రెండు దశలు పూర్తి చేసుకుం దని, కరోనా వ్యాక్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ టీకాను మొత్తం 743 మందిపై ప్రయోగించామని సినోవ్యాక పేర్కొన్నది. 18-59 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారిపై ఈ టీకా ప్రయోగాలు చేసినట్లు వెల్లడించింది. టీకా తీసుకున్న 14 రోజుల తర్వాత వారిలోని 90 శాతం మందిలో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీలు ఉత్పన్నం అయ్యాయని స్పష్టంచేసింది. తమ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి తీవ్రస్థాయి దుష్ప్రభావాలు ఏవిూ ఎదురుకాకపోవడం ఊరటనిచ్చే అంశమని, ఇక మూడో దశ ట్రయల్స్‌ దేశం బయట నిర్వహించాలనుకుంటున్నామని సినోవ్యాక్ బయోటెక్ వెల్లడించింది. ఇందుకోసం బ్రెజిల్‌లోని ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com